T.H.E | Episode 5 (final) | A Thriller from SamosaTimes


T.H.E | Ep:5 (Final)

--- శుక్రవారం 15/Sep/2017 ---

అమ్మ కి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదు. అమ్మ ని స్కూల్ లో డ్రాప్ చేసి, నేను ఇంటికి వచ్చేసాను. మనసంతా గందరగోళం గా ఉంది. వెళ్లి ఫ్రెష్ గా పొగలు గక్కే వేడి నీళ్ళ తో షవర్ చేశాను. బాత్రూం మొత్తం పొగలు. నా జీవితం లాగే. ఈ పొగ లో ఏది ఎక్కడ ఉందొ కన్పించట్లేదు. అలాగే నా జీవితం లో ఏం జరగబోతోంది ఊహించలేకపోతున్నాను. షవర్ చేశాక కాస్త ఎనర్జీ వచ్చింది. కప్ బోర్డు తీసి నా లక్కీ రెడ్ Tshirt వేస్కున్నా. వెళ్లి కాస్త లంచ్ తిని, నా బెడ్ రూమ్ లో కూర్చున్నా. ఇప్పుడు ఇక అలోచించి ఉపయోగం లేదు. ఇక్కడనుంచి ఆరు అవ్వగానే బయలుదేరాలి.  నాతోపాటు ఎం తిస్కేల్లాలి... నా ఫోన్..అక్కడికి వెళ్ళడానికి నా బైక్. ఇంకేం అవసరం లేదన్పించింది. బైక్ అంటే గుర్తొచ్చింది, అది వాడి ఎన్ని రోజులు అయిందో. కీస్ ఎక్కడ పెట్టానో మర్చిపోకుండా ఉండటానికి బాల్కనీ కీస్ కి అటాచ్ చేసి పెట్టాను. 

ఈ టెన్షన్ లో ఇక ఆఫీసు కి ఏం వెళ్తాం అని లీవ్ అడగడానికి మేనేజర్ కి ఫోన్ చేశాను, ఈరోజు ఆఫీసు కి రావడం కుదరదు, కొంచెం పర్సనల్ ఎమర్జెన్సీ అని. తను లిఫ్ట్ చేయలేదు. మా ఆఫీసు రిసెప్షన్ కి ఫోన్ చేశా..
"hai this is krishna speaking."
"hello sir, how can i hep you." 
"im an employee of the company. i will be on emergency leave today. could you inform my manager" 
"sure sir, can i know the name of your manager and his employee id"
"Radhamohan, 254889" 
"thank you, can i know your name and employee id"
"Krishnakumar, 624145"
"thank you, we will inform once he comes to office" 
"thank you.. bye"

కృష్ణ కుమార్...తన నేమ్ కుమార్ అని చెప్పాడు... నన్ను అందరు కృష్ణ అనే పిలుస్తారు...ఇతనెవరో కావాలనే నా నేమ్ కూడా ఇమిటేట్ చేస్తున్నాడు. ఇలా ఆలోచిస్తూ, ఆ మ్యాప్ కి సంభందించిన విషయాలు ఎమన్నా తెలుస్తాయేమో అని గూగుల్ లో మొత్తం వెతికాను. ఏమి చూపించట్లేదు. పైగా ఒంటరి గా రమ్మన్నాడు. ఆ ప్లేస్ లో ఏంటో అర్థం కావట్లేదు. దీని గురించి ఆలోచిస్తూ.. వెతుకుతూ ఉండగానే టైం కాస్త సాయంత్రం 5.30 అయ్యింది. కాస్త ఫ్రెష్ అయ్యి అమ్మ కి ఫోన్ చేశాను.. "అమ్మ.. పొద్దున తలనొప్పి గా ఉంటె ఆఫీసు కి పోలేదు.. ఇప్పుడే మేనేజర్ ఫోన్ చేసాడు. కొంచెం వర్క్ ఉందంట.. నువ్వు కాబ్ తీస్కోని ఇంటికి వచ్చేయ్. నేను ఇప్పుడు ఆఫీస్ కి వెళ్లి నైట్ కొంచెం లేట్ గా వస్తాను... సరే నా..". "సరే నాన్నా.. నువ్ టాబ్లెట్ వేస్కునావ్ కదా.." హా వేస్కున్నా అమ్మా.." " సరే .. వెళ్లి త్వరగా వచ్చేయ్.." " ok మా.. bye." ఆఫీసు కి వెళ్తున్నా అని అబద్ధం చెప్పా. నిజం చెప్పడానికి నాకు కూడా నిజం పూర్తిగా తెలియదు. టైం 5.55 అయ్యింది.  హెల్మెట్ తీస్కోని ఇంటికి లాక్ చేసి, ఆఫీసు కి వెళ్తున్నా అని చెప్పి, లొకేషన్ మాప్ ని నా ఫోన్ లోని గూగుల్ మాప్స్ లో సెట్ చేస్కొని బయల్దేరాను. 

సిటీ దాటేసరికి 40 నిమిషాలు పట్టింది. ఇక్కడినుంచి 110 km. ట్రాఫిక్ కూడా లేదు. స్పీడ్ గా వెళ్తే గంట ముప్పై నిమిషాల్లో అక్కడ ఉండచ్చు. ఒక 20 km వెళ్ళాక మ్యాప్ లో మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ టర్న్ ఉంది..ఫారెస్ట్ లోకి. చాలా చిన్న దారి. opposite ఇంకొకరు వస్తే stuck అయిపోవాల్సిందే. రోడ్ క్లియర్ గా లేదు, అదికాక మట్టి రోడ్. స్పీడ్ గా వేల్లలేకపోతున్నా... అలా ఫారెస్ట్ లో కొంచెం దూరం వెళ్ళాక నెట్వర్క్ సిగ్నల్ రాక గూగుల్ మాప్స్ పనిచేయలేదు. కాని ప్రింట్ అవుట్ ప్రకారం ఫాలో అవతూ వెళ్ళా. దాదాపు గా రాత్రి 9 గంటలకి మ్యాప్ లో ఉన్న ప్రదేశం చేరుకున్నా. అక్కడ ఏమి కనిపించడం లేదు... మట్టి రోడ్ కూడా అక్కడితో ఎండ్ అయిపొయింది.మొత్తం నిర్మానుష్యం గా ఉంది. చుట్టూ చీకటి. బైక్ హెడ్ లైట్స్ ఆన్ చేసి ఉంచాను అలాగే.

ఎక్కడినుంచో చిన్నగా అడుగుల శబ్దం వినిపిస్తోంది. డోర్ ఓపెన్ అయిన శబ్దం. ఎందుకైనా మంచిదని, బైక్ ఇంజిన్ ఆఫ్ చేసి, తుప్పల వెనుక పార్క్ చేసి, నేను అక్కడే దాక్కున్నాను. ఎవరో వ్యక్తి, నాకు ఎదురుగా ఉన్న చెట్లలోంచి బయటికి వచ్చాడు. "కృష్ణ..నువ్ అక్కడ తుప్పల్లో ఉన్నావని నాకు తెలుసు. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. ఈ ప్లేస్ ని ఆర్మీ వాచ్ చేస్తూ ఉంటుంది. త్వరగా నాతో రా." అన్నాడు. అతనే కుమార్ అనుకుంట. టోపీ పెట్టుకోవడం వల్ల మొహం సరిగ్గా కనబడట్లేదు. పైగా చీకటి. నిండా మునిగాక చలి అనడం ఎందుకని అతని వెంటే భయలుదేరాను. కొంచెం దూరం వెళ్ళాక అండర్గ్రౌండ్ లోకి ఉన్న ఒక  పెద్ద మెటల్ డోర్ ని, తన దగ్గర ఉన్న access కార్డు ద్వార ఓపెన్ చేసాడు. కిందకు దిగడానికి మెటల్ స్టెప్స్ ఉన్నాయి. లోపల లైట్స్ ఉన్నాయి.. కిందకి దిగే కొద్ది కొంచెం కొంచెం గా లైట్ ముందు వెళ్తున్న వ్యక్తి పై పడ్తోంది. అప్పుడర్థమైంది అతనే ఎవరో.. ఆ రోజు ఆక్సిడెంట్ అయ్యే ముందు కార్ కి అడ్డం వచ్చిన వ్యక్తి ఇతనే, అదే tshirt ,అదే టోపీ. పైగా అది నేను వేసుకున్న రెడ్ tshirt లాంటిదే.

మెట్లు దిగగానే అక్కడే ఒక 20 సెకండ్లు ఆగమని సైగ చేసాడు."ఇక్కడ  surveillance కెమేరాస్ ఉన్నాయి. వీటి కంట పడకుండా మనం అక్కడ ఉన్న చిన్న రూమ్ లోకి వెళ్ళాలి" అని చెప్పాడు.  తర్వాత వేగంగా పక్కనే ఉన్న చిన్న రూమ్ లోకి వెళ్లి, నన్ను కూడా త్వరగా రమ్మన్నాడు.నేను వేగం గా రూమ్ లోకి వెళ్ళిపోయాను. చూడటానికి అది జనరేటర్ రూమ్ లా ఉంది. తను డోర్ క్లోజ్ చేసి, టోపీ తీసేసాడు. ఆశ్చర్యం.. నాలానే ఉన్నాడు. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. "నీకు కుమార్ అని కాల్ చేసింది నేనే. ఆక్సిడెంట్ అవ్వకుండా నీ కార్ కి అడ్డం వచ్చింది కూడా నేనే.." చెప్పాడు తను. నా మెదడు లో చాలా questions. ఏం అడగాలో కూడా అర్థం కావట్లేదు. కానీ నాకు ఉన్న ప్రతి question కి జవాబు కావాలి. "అసలు ఏం జరుగుతోంది..." అడిగాను అతన్ని.

కృష్ణ... నీకు ఉన్న knowledge, నీకు తెలిసిన science ప్రకారం, నేను చెప్పబోయేది నీకు అర్థం అవుతుంది. ఇది ఒక సీక్రెట్ రీసెర్చ్ బేస్. ఇక్కడ govt of India, అటామిక్ రీసెర్చ్ సంబందించిన ప్రాజెక్ట్ చేస్తుంటుంది. అందుకే జనావాసానికి దూరం గా ఇక్కడ రిసెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ ఒక 20 సంవత్సరాల తర్వాత govt. of India కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తుంది. నువ్వే దానికి ప్రాజెక్ట్ లీడ్. ఇప్పుడు నువ్వు మీ కంపెనీ లో చేస్తున్న photon particle accumulation రీసెర్చ్ ఈ ప్రాజెక్ట్ కి దారితీస్తుంది. vaccum లో photon పార్టికల్స్ ని కృత్రిమంగా bind చేసినప్పుడు అది ఒక చిన్నపాటి స్టార్ లా క్రియేట్ అవ్తుంది. తర్వాత దాన్ని stabilize చేస్తే మెల్లగా అందులో ఉన్న ఎనర్జీ, కాంతి లా మారి లాస్ అవ్వడం వల్ల అది ఒక చిన్న బ్లాక్ హోల్ లా మారుతుంది. బ్లాక్ హోల్ అంటే కేవలం తన చుట్టూ ఉన్న ఎనర్జీ ని, మేటర్ ని మింగేయడమే కాదు. ఒక కాలానికి ఇంకో కాలానికి మధ్య పోర్టల్ లాగా , అంటే ఒక గేట్ వే లాగా పని చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ జనవాసం ఉన్న ప్రదేశాల్లో చేయకూడదు కాబట్టి, ఇక్కడ అండర్గ్రౌండ్ లో చేస్తున్నారు. నువ్వు ఈ ప్రాజెక్ట్ చేసే టైం లో బ్లాక్ హోల్ ని stabilize చేసి, ఇప్పుడు మనం ఉన్న టైం లో పోర్టల్ క్రియేట్ అయ్యేలా చేశావు. ఎప్పుడు ఈ పోర్టల్ లో ప్రవేశించిన, అమ్మ కు ఆక్సిడెంట్ అవ్వకు ముందు రోజు కి ఈ పోర్టల్ నిన్ను తీస్కేల్తుంది. ఆ విధం గా నువ్వే టైం లో బ్యాక్ వచ్చి అమ్మ ని కాపాడావు.

"నువ్వు చెప్పింది నాకు అర్థం అయింది... అంటే నువ్ ఇప్పుడు.." 

" ఇది టైం పోర్టల్ కి ఒక సైడ్ ఎఫెక్ట్ లాంటిది...నువ్ తిరిగి మల్లి సోమవారానికి వెళ్లి అమ్మ ని కాపాడాలి.. నువ్ ఇప్పుడు వెళ్ళకపోతే అప్పుడు జరిగింది ఏది జరగదు...అంటే నీకు ఫోన్ రావడం... కార్ కి నేను అడ్డు రావడం...ఇవేవి జరగవ్. ఇప్పుడు నువ్వూ వెళ్తేనే కదా అప్పుడు నువ్ ఇవన్ని చేసేది." 

" మరి నా లాంటి నువ్వు ఎలా సాధ్యం..."

"ఇది కాస్త confuse చేసే విషయం. నువ్వూ తిరిగి వెళ్ళిన ప్రతి సారి, కాలం రెండు గా విడి పోతుంది... ఒకటి నువ్వు అమ్మని కాపాడుకోవడానికి వెళ్ళే టైం లైన్... రెండు.. ఇప్పుడు మనం ఉన్న టైం లైన్. ఈ రోజు లోగా నువ్వు తిరిగి వెళ్ళాక పోతే, టైం పోర్టల్ డెడ్ అవ్తుంది... మనం ఉన్న టైం లైన్ కొలాప్స్ అవ్తుంది. మనం టైం ని కొలాప్స్ అవ్వకుండా చూస్కుంటూ..ఈ సైకిల్ ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు జరిగే ఈ టైం లైన్ లో ఇకపై నేను నువ్వూ గా వెళ్తాను...సోమవారం నుండి create అయ్యే టైం లైన్ కి నువ్వు వెళ్లి.. అమ్మని కాపాడాలి. ఆ టైం లో నువ్ ఆల్రెడీ ఇంట్లో ఉంటావ్ కాబట్టి.. నిన్ను నువ్ కలవకుండా ..మేనేజ్ చెయ్..ఎందుకంటే... ఇది ఇలానే జరగాలి.. ఎక్కడ చేంజ్ జరిగిన..ఆ చేంజ్ తర్వాత జరిగే ఎఫెక్ట్ మనం అంచనా వేయలేం..అందుకనే నువ్ కూడా నేను ఎం చేసానో అదే చెయ్..నేను నీకు ఇప్పుడు ఎం చెప్తున్నానో అదే చెప్పు..నాకు కూడా ఈ విషయాలు ముందు సైకిల్ లో ఉన్న కృష్ణ చెప్పాడు. ఇప్పుడు నేను ని ప్లేస్ లో ఇంటికి వెళ్తాను..నువ్ టైం లో బ్యాక్ వెళ్లి..అమ్మ ని కాపాడి, కృష్ణ ని ఇక్కడ్కికి వచ్చేలా చేసి, అతని ప్లేస్ లో నువ్ వెళ్ళాలి..అతన్ని ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయించాలి."

"ఈ టైం లైన్ లో ఈ ప్రాసెస్ ఆల్రెడీ అయిపొయింది కదా..నేనే తిరిగి వెళ్లిపోవచ్చు కదా.."

"నువ్వు వెళ్ళచ్చు..కాని టైం పోర్టల్ లో ఒకరు ఒకసారి మాత్రమే వెళ్ళగలరు...నేను ఆల్రెడీ టైం పోర్టల్ నుంచి వచ్చా కాబట్టి నేను వెళ్ళలేను. నువ్వు వెళ్ళకపోతే, టైం పోర్టల్ డెడ్ అవుతుంది. మన ఉన్న టైం లైన్ కొలాప్స్ అవుతుంది. అందరం చనిపోతాం. మనం పడ్డ శ్రమ వృథా అవుతుంది. నీకు బ్రతకాలని లేదా.. చెప్పు."

" ఉంది..నాకు ఇప్పుడు అంత అర్థం అయ్యింది..నేనేం చేయాలి.."

"ఈ access కార్డు తీస్కో..కరెక్ట్ గా 10.30 కి నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ జనరేటర్ పక్కనే పవర్ లైన్ ని కట్ చేస్తాను...జనరేటర్ ఆన్ అవ్వడానికి 20 సెకండ్స్ పడ్తుంది..జనరేటర్ ఆన్ అయ్యాక కెమేరాస్ ఆన్ అవ్వడానికి ఇంకో 40 సెకండ్స్ పడ్తుంది. ఈ లోగ నువ్వు రీసెర్చ్ రూమ్ 35 కి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మధ్యలో నీ కో-సైంటిస్ట్ లు ఉంటారు.. వాళ్ళకి అనుమానం రాకుండా నువ్వు ఆ రూమ్ కి వెళ్ళాలి. అక్కడ ఎవరు ఉండరు. రూమ్ సెంటర్ లో నువ్వు డిజైన్ చేసిన బ్లాక్ హోల్ stabilizer, దాని మధ్యలో బంతి లాంటి ఒక void కన్పిస్తుంది..నువ్వు దాన్ని టచ్ చేస్తే చాలు...ఆ stabilizer కి పవర్ సప్లై వేరే సోర్స్ నుంచి ఇస్తారు. సో నేను ఇప్పుడు పవర్ కట్ చేసిన ఎం ప్రాబ్లం ఉండదు. నేను పవర్ కట్ చేసిన  1 మినిట్ లోపు నువ్ ఇదంతా చేయాలి..."

"సరే.."

"లైన్ కట్ చేస్తున్నా..." 

**** మొత్తం చీకటి ****

"స్టొరీ సూపర్ ఉంది బ్రో...మంచి కాన్సెప్ట్..తప్పకుండా దీన్ని మూవీ లా తీద్దాం.." చెప్పాడు మా డైరెక్టర్... అతని దగ్గరే 3 సంవత్సరాలుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నా.
"thank you సర్.."
"అన్నట్టు స్టొరీ టైటిల్ T.H.E అన్నావ్.. ఏంటి దాని మీనింగ్... " అడిగాడు మా డైరెక్టర్.
"T.H.E అంటే ..  Time Heals Everything" 

T.H.E E.N.D

Comments