T.H.E | Episode 1 | A Thriller from SamosaTimes


T.H.E | Ep 1

--- సోమవారం 11/Sep/2017 ---
సాయంత్రం 6 గంటలు. ట్రింగ్ ట్రింగ్...ట్రింగ్ ట్రింగ్...ల్యాండ్ లైన్ మోగింది...monday ఆఫీసు కి వెళ్ళాలంటే కష్టం. ఇక పని చేయాలంటే మరీ కష్టం. అందుకే work from home చేస్తున్నా. ఇందాకే వెళ్లి అమ్మను స్కూల్ నుంచి తీస్కోచ్చా. " అమ్మ...ఫోన్ చూడు కాస్త. నేను వర్క్ చేస్కుంటున్నా.." అని చెప్పా. అమ్మ వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసింది. నేను నా రూమ్ లో కూర్చొనే అమ్మ ఏం మాట్లాడ్తుందో వింటున్నా...
అమ్మ: "హలో ఎవరు.." 
అవతలి వ్యక్తి: "______________"
అమ్మ: "కుమార్ ఆ ..."
అవతలి వ్యక్తి: "___________________"
అమ్మ: "కృష్ణ కి ఇవ్వాలా?" 

" చిన్నా.. నీకే ఫోన్.. ఎవరో కుమార్ అట." చెప్పింది అమ్మ..
చేస్తున్న పని ఆపేసి వెళ్లి ఫోన్ తీసా...
"ఎవరో కుమార్...వాయిస్ నీలానే ఉందనుకో... సరే, ఇదిగో మాట్లాడు.." 

నేను: " హాయ్ కుమార్, కృష్ణ స్పీకింగ్..."
కుమార్: " చిన్నా...సారీ, కృష్ణా.. నేను నీకు బాగా తెల్సు...నువ్ కూడా నాకు బాగా తెల్సు... కాని నేనెవ్వరో ఇపడు నువ్ మర్చిపోయి ఉంటావ్.
               అది ఇంపార్టెంట్ కాదు. నువ్వేమీ questions వెయ్యకుండా..నేను చెప్పేది జాగ్రత్త గా విను. "
నేను: "సరే చెప్పండి" 
కుమార్: "రేపు మీకో పెద్ద ఆక్సిడెంట్ జరగబోతోంది. అందులో అమ్మ మరణిస్తుంది."
నేను:" bull shit.. who the hell is this..." 
కుమార్: "కృష్ణా.. నీ కన్ఫ్యూషన్ , కోపం నాకు అర్థం అయ్యాయి. నేను చెప్పేది పూర్తిగా విను. రోజు లాగే నువ్ ఆఫీసు కి వెళ్తావ్. స్కూల్ నుంచి అమ్మ ని పికప్ చేస్కొని వచ్చేప్పుడు మెయిన్ రోడ్ T-Junction దగ్గర ఆక్సిడెంట్ జర్గుతుంది." 
నేను: " చూడు.. నువ్ ఎవరో నాకు తెలిదు... నీకు ఆట పట్టించడానికి నేనే దొరికానా..నోర్ముస్కోని ఫోన్ పెట్టేయ్.."
కుమార్: " కుమార్..సారీ, కృష్ణా..నువ్ ఎంత కన్ఫ్యూషన్ లో ఉన్నావో నేన్ను కూడా అంతే కన్ఫ్యూషన్ లో ఉన్నాను. కాని ఇది నిజం.
               అలా అని నువ్ అమ్మ ని ఇంట్లోనే ఉంచకు. లేదా రోజు వచ్చే టైం కంటే లేట్ గా రాకు. అప్పుడు ఎం జరుగుతుందో మనకు అస్సలు తెలియదు.
             నువ్ ఏ విధంగా అయినా మరణం నుండి అమ్మ ని తప్పించలేవ్. ఎలా ఉన్నా..ఎక్కడ ఉన్నా..ఎదో ఒక ప్రమాదం జరుగుతుంది. మనం దానికి సొల్యూషన్ కనిపెట్టేలోపు జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. కాని రోజూ లాగే చేస్తే. నా దగ్గర అమ్మ ని కాపాడే మార్గం ఉంది.
               " అది కేవలం నువ్వు మాత్రమే చేయగలవ్. అది చాలా సింపుల్.  సాయంత్రం 6.30 కల్లా నువ్ అమ్మ ని పికప్ చేస్కొని T-Junction దగ్గర ఉండాలి. కాని ఎట్టి పరిస్థితి లో ను 6.35 అయ్యే దాక నువ్వు T-Junction ని cross చేయకు. అంతే. నువ్వు నన్ను  నమ్ముతున్నావ్ అని నేను నమ్ముతున్నాను. అమ్మ జాగ్రత్త..." 
నేను: " హలో..హలో..ఫోన్ పెట్టేసాడు"

వీడు చెప్పేది నిజామా అబద్ధమా..ఈ మధ్య ఇలాంటి prank calls చేసి, మాటలు record చేసి..youtube లో పెడ్తున్నారు చాలామంది అడ్డమైన వెధవలు. వీడు కూడా అలానేనా.. ఏంటి ఈ కన్ఫ్యూషన్. నాకైతే ఏమాత్రం నమ్మాలని లేదు. అయినా వీడికి మా ల్యాండ్ లైన్ నెంబర్ ఎలా తెల్సింది. ఆ నెంబర్ చాలా కొంతమందికి మాత్రమె తెలుసు. అప్పుడెప్పుడో ఇంటర్నెట్ కనెక్షన్ కోసం BSNL ల్యాండ్ లైన్ తీస్కున్నాం. ఇప్పుడు అందరం mobile phone వాడ్తున్నాం. అప్పుడప్పుడు customer care.. లేదంటే అమ్మ చిన్ననాటి friends మాత్రమే ఆ ల్యాండ్ లైన్ కి కాల్ చేస్తారు. 

"అమ్మా..." అమ్మ కి ఈ విషయం చెప్పాలని పిలిచాను. "చెప్పు చిన్నా..." అడిగింది అమ్మ కిచెన్ లో వంట చేస్తూ. ఎందుకు అనవసరం గా అమ్మను ఖంగారు పెట్టడం అని చెప్పలేదు. "ఏం కూర వండుతున్నావ్.." అని అడిగి కవర్ చేశాను.

స్కూల్ లో పిల్లలతో తలనొప్పి.. అల్లరి..అన్నీ భరించి.. ఇంటికి వచ్చాక అన్ని పనులు చూస్కొని, వంట చేసి.. చాలా కష్టపడ్తోంది తను. అందుకే ఈ మధ్య నా పెళ్లి విషయం తీస్కోస్తోంది ప్రతి చిన్న విషయానికి. "కృతిక" విషయం చెప్పేద్దామా.. వద్దు వద్దు..తననే ఇంటికి తీస్కొచ్చి అమ్మ కి పరిచయం చేస్తే ఎలా ఉంటుంది.. బాగోదేమో..ఈ విషయాన్నీ దీర్గంగా అలోచించి ఒక నిర్ణయం తీస్కోవాలి.

అన్నట్టు నా గురుంచి చెప్పడం మరచిపోయాను. నేను SoulScience అనే ప్రైవేటు రీసెర్చ్ కంపెనీ లో Jr.సైంటిస్ట్ గా వర్క్ చేస్తుంటాను. photon binding అనే కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు రీసెర్చ్ ఫాస్ట్ గా చేయాలనే ఒత్తిడి తప్ప జీవితం లో ఎలాంటి బాధ లేదు.  మంచి జీతం. మంచి ఫ్రెండ్స్ ..  బిందాస్ లైఫ్.

రాత్రి భోజనం అయిపోయాక...వెళ్లి బెడ్  రూమ్ లో మెల్లగా ఇళయరాజా సాంగ్స్ పెట్టుకొని పడుకున్నా.. మళ్ళీ ఆ కాల్ గుర్తొచ్చింది. కాని ఎందుకో నమ్మశక్యం గా లేదు. అయినా నేనేంటి... రేపటి గురించి ఎవడో ఈరోజే చెప్పేస్తే, అది నేను నమ్మేసి ఇంతలా ఆలోచిస్తున్నా..నా పిచ్చి కాకపోతే. అయినా నేను ఫోన్ తీస్కోగానే.. చిన్నా అన్నాడు..అమ్మ మాత్రమే నన్ను అలా పిలుస్తుంది..." ఇలా ఆలోచిస్తూ నిద్ర లో జారుకున్నా....

Comments