this funny news bulletin from the year 2050 makes you laugh and makes you think



💧💧2050 లో వార్తా సమాహారం..

* * * * *

ఈరోజు వార్తలు..

🏠 నెల్లూరు నగరంలో తాళం వేసిన ఇంట్లో ఉన్న మూడు బిందెల నీళ్ళు దొంగిలించిన దుండగులు , వారి కోసం పోలీసుల వెతుకులాట..

👫మూడు సంవత్సరాల పాపని lkg లో చేర్చుకోవడానికి రెండు బిందెల నీటిని అడిగిన స్కూల్ ప్రధానోపాధ్యాయుడి అరెస్ట్..

💂రెండు బిందెల నీటిని ఇస్తే ఒకే సంవత్సరంలో 50 బిందెల నీటిని ఇస్తాం అనే నీటి మోసగాళ్ళ బృందం నుండి జాగ్రత్తగా ఉండాలని ప్రజలని హెచ్చరించిన ప్రభుత్వం.

😎 మేము అధికారంలోకి వస్తే రేషన్ షాపులో మూడు బిందెల నీటిని ఉచితంగా ఇస్తామన్న ప్రతిపక్షం - ఇది సాధ్యం కాదని ఖండించిన అధికారపక్షం

🚀భూమి నుండి గురుగ్రహం మీదకి రాకెట్ ద్వారా దొంగతనంగా పంపిన 20,000 లీటర్ల నీటిని స్వాధీనం చేసుకున్న గగన రక్షకభటులు

🏦 ప్రపంచ నీటి బ్యాంకు నుండి 50 కోట్ల లీటర్ల నీటిని అప్పుగా తీసుకున్న ఇండియా

👪దేశ ప్రజలంతా నెలకి ఒకసారి మాత్రమే స్నానం చేయాలని , స్నానానికి రెండు చెంబుల నీటిని మాత్రమే వినియోగించాలని చట్టం చేసిన కేంద్రప్రభుత్వం - స్వాగతించిన ప్రతిపక్షం

⛲ఈరోజు నీటి ధరల వివరాలు..
బావి నీరు ఒకలీటరు - 4364/-
నది నీళ్ళు ఒక లీటరు - 8749/-
శుద్ధి చేసిన నీరు లీటరు - 12542/- రూపాయల లెక్కన అమ్మకాలు జరుగుతున్నాయి.

* * * * *


share it with your friends!!