a letter from Bhallala deva to Kattappa tells you why Kattappa killed Bahubali. the funniest reason ever!! Posted by SamosaTimes Get link Facebook X Pinterest Email Other Apps ఆదివారం కదా చికెన్ తీసుకుని రమ్మని శివగామిని కట్టప్పని బజారుకి పంపింది ... వస్తూ వస్తూ అదే చేత్తో నిన్న ఇచ్చిన ఇస్త్రీ బట్టలు కూడా తెమ్మంది ...క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు అని తిట్టుకుంటూ కట్టప్ప బయల్దేరాడు ...చాంతాడంత లైన్ లో నుంచుని ఎట్టాగొట్ట చికెన్ తెచ్చాడు కట్టప్ప ....ఇంటికి వచ్చే సరికి తలుపు గెడపెట్టి వుంది ... ఒక చీటీ కూడా పెట్టుంది ....ఏంటా అని తీసి చూస్తే ... కట్టప్పా ...!!! మేమందరం శ్రీమంతుడు సినిమాకి వెళ్తున్నాం ... నిన్నూ తీసుకుని వెళ్దాం అనుకున్నాం ... కాని అన్నయ్య బాహుబలి , ఎందుకు రా ... అసలే టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయ్ ... ఇంటికాడ వుంటే వచ్చేసరికి అన్నం, కూర వండుతాడు అన్నాడు. ఇది విన్న మా అమ్మ శివగామిని ... భళా బాహుబలి ... రాజంటే డబ్బులు పొదుపు ఎలా చెయ్యాలి అనే ఆలోచన వుండాలి , కావాలంటే వచ్చాక కళ్ళకి కట్టినట్టు మనం కథ చెప్దాం అని, ఇదే నా మాట .. నా మాటే శాసనం అంది ....అందుకే మేము వెళ్తున్నాం, వచ్చేసరికి చికెన్ కూర, అన్నం వండి ఉంచు . కూరలో ఉప్పు కారం తక్కువ వెయ్యి నీకు తెలుసు గా బిజ్జలదేవ కి అసలే బి. పి. అమ్మ చెప్పమంది.ఇట్లు,భళ్లాల దేవా 😂😂 అందుకే బాహుబలిని కట్టప్ప సంపేసాడని నా బలమైన పీలింగ్ .... Comments
Comments